Site icon NTV Telugu

Animal: యానిమల్ టాక్.. ఏదో తేడాగా ఉందే.. ?

Animal Movie Review

Animal Movie Review

Animal: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి.. మిక్స్డ్ టాక్ ను అందుకుంటుంది. సందీప్ వంగా సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. అందులో సినిమా రన్ టైమ్ మూడు గంటలకు పైగానే ఉండడంతో అభిమానులు సినిమా బావుంటే చాలు.. ఎంతసేపైనా కూర్చుంటామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా అంతా బావున్నా కూడా సెకండ్ హాఫ్.. లెంత్ ఎక్కువ ఉండడం, కొన్ని సాగాదీసే సన్నివేశాలు ఉండడంతో ఫ్యాన్స్ మైండ్ కు ఎక్కలేదని అంటున్నారు.

Allari Naresh : ‘బచ్చలమల్లి’ గాడిగా వస్తున్న అల్లరి నరేష్..

అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న ఫీల్ అయితే ఉంది కానీ, కొన్ని సన్నివేశాలు మరి దారుణంగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం చూపించినంత వరకు ఓకే కానీ, హీరోను ఎలివేట్ చేసే విధానం మరీ ఎబెట్టుగా ఉందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా అక్కను ఏడిపించినందుకు స్కూల్ కుర్రాడైన హీరో.. గన్ తీసుకెళ్లి బెదిరించడం.. బట్టలు లేకుండా హీరో అందరి ముందు నడుచుకుంటూ రావడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించాయని అంటున్నారు. సినిమా హిట్ అవ్వాలంటే.. మొదటి భాగం కంటే రెండవ భాగం బావుండాలి. అయితే ఇక్కడ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్, లెంత్ ఎక్కువ అవ్వడం లాంటివి సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకునేలా చేస్తున్నాయి అనేది అభిమానుల అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ లో వచ్చిన హై కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో అక్కడే ప్రేక్షకులకు సహనం చచ్చిపోతుందని, వెయిట్ చేసి చివరికి ఉసూరుమనిపించేలా ఉన్నాయని అంటున్నారు. మరి కలక్షన్స్ విషయంలో యానిమల్ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version