Site icon NTV Telugu

Prithiveeraj: రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చిన పృథ్వీరాజ్‌.. ?

Prudvi

Prudvi

Prithiveeraj: నటుడు బబ్లూ పృథ్వీరాజ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సినిమాతో అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో పృథ్వీరాజ్‌ కనిపించడంతో.. అతనికి మరింత హైప్ వచ్చింది. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. పర్సనల్ లైఫ్ ద్వారానే ఆయన ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. గతఏడాది పృథ్వీరాజ్‌ తనకన్నా 30 ఏళ్లు వయసున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా మారాడు. 1994 లో బీనా అనే ఆమెను పృథ్వీరాజ్‌ వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు.

Dunki Drop 3 : షారుఖ్ ఖాన్ ఫేవరెట్ సాంగ్ వచ్చేసింది..

ఇక కొన్నాళ్ళు కలిసి ఉన్న ఈ జంట విబేధాల వలన ఆరేళ్ళ క్రితం నుంచి విడిగా ఉంటున్నారు. గతేడాదే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న రెండు నెలలకే పృథ్వీరాజ్‌, శీతల్ అనే అమ్మాయికి దగ్గరయ్యాడు. ఆమె వయస్సు పృథ్వీరాజ్‌ కంటే 30 ఏళ్లు చిన్నది. అయినా కూడా ఎవరికి భయపడకుండా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహం పెద్ద రచ్చనే క్రియేట్ చేసింది. ఇక ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదని తెలుస్తోంది. ఏడాది కూడా నిండకుండానే వీరిమధ్య విబేధాలు తలెత్తాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త జంట కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. యానిమల్ ఇచ్చిన క్రేజ్ తో పృథ్వీరాజ్‌ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మరి ముందు ముందు పృథ్వీరాజ్‌ ఎలాంటి సినిమాల్లో నటిస్తాడో చూడాలి.

Exit mobile version