Dunki Drop 3 : షారుఖ్ ఖాన్ ఫేవరెట్ సాంగ్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హిరాని తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించారు..డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో షారుఖ్ ఖాన్ డంకీ కూడా ఒకటి..తాజాగా ఈ సినిమా నుంచి నుంచి డ్రాప్ 3 శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజైంది. డ్రాప్ 2 లుట్ పుట్ గయా సాంగ్ మానియా నుంచే ఇంకా పూర్తిగా బయటకు రాక ముందే షారుక్ ఫేవరెట్ అయిన నిక్లే థే కభీ హమ్ ఘర్ సే అని సాగిపోయే ఈ పాట వచ్చింది.డంకీపై ఉన్న బజ్ ను మరింత పెంచేలా ఈ పాట ఉంది.ప్రభాస్ సలార్ మూవీతో పోటీ పడుతున్న డంకీ మూవీ.. ఎక్కడా అంచనాలు తగ్గకుండా డంకీ చిత్ర యూనిట్ తమ సినిమాపై ఉన్న బజ్ రోజురోజుకూ పెంచుతూనే ఉంది. షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద అలజడి సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు.డంకీ నుంచి ఈ లేటెస్ట్ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.సోనూ నిగమ్ పాడిన ఈ పాటను ప్రీతమ్ కంపోజ్ చేశాడు. జావెద్ అక్తర్ ఈ పాటకు లిరిక్స్ ను అందించాడు.
ఇంటి నుంచి దూరంగా ఉంటూ తమ ఇంటిని మిస్ అవుతున్నామని ఫీలయ్యే ప్రతి వ్యక్తి మనసునూ తాకేలా ఈ పాట ఉంది. డంకీ ట్రైలర్ పై ఈ పాట మరిన్ని అంచనాలను పెంచేసింది.ఈ లేటెస్ట్ డ్రాప్ గురించి చెబుతూ షారుక్ ఖాన్ ఓ ఎమోషనల్ క్యాప్షన్ ను ఉంచాడు. “ఇవాళ ఎందుకో నా మనసుకు తోచింది. దీంతో ఈ పాటను మీతో షేర్ చేసుకుంటున్నాను. రాజు, సోనూ పేర్లు వింటే మన వాళ్లే అన్న భావన కలుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ పాట కూడా మన వాళ్లదే. మన ఇంట్లోని వాళ్ల జ్ఞాపకాలది. మన మట్టిది.మన దేశం ఒడిలో ఓ రకమైన హాయి దొరుకుతుంది. మనమందరం ఎప్పుడో ఒకసారి ఇంటి నుంచి, ఊరి నుంచి, పట్టణం నుంచి దూరంగా వెళ్తాం. మన జీవితం కోసం కానీ మన మనసులు మాత్రం ఇంట్లోనే ఉండిపోతాయి. డంకీలో నా ఫేవరెట్ ఇది” అని షారుఖ్ తెలిపారు.ఇదిలా ఉంటే డంకీ మూవీ డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రెండు మెగా మూవీస్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది..
Also Read
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!