Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ఆగడు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీనువైట్లకు భారీ డ్యామేజ్ జరిగింది. నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆగడు సినిమా ప్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమా అనుకున్నప్పుడు స్క్రిప్ట్ మాకు ఓకే అనిపించింది. కానీ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. వాళ్ల అంచనాలను తగ్గట్టు మూవీ లేకపోయేసరికి నాలుగో రోజు నుంచే కలెక్షన్లు భారీగా పడిపోయాయి.
Read Also : Bigg Boss 9 : నాగార్జుననే తప్పు బట్టిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఏంట్రా ఇది..
వాస్తవానికి మేం ఈ సినిమాను సెప్టెంబర్ 26న రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ అనుకోకుండా 19వ తేదీన రిలీజ్ చేశాం. అప్పటికి సినిమా ఆడాలి అంటే మినిమమ్ రెండు వారాల గ్యాప్ ఉండాల్సిందే. కానీ ఆగడు డిజాస్టర్ టాక్ రాగానే లౌక్యం మూవీని 26న రిలీజ్ చేశారు. అది సూపర్ హిట్ అయింది. దీంతో ఆడియెన్స్ మైండ్ అటువైపు వెళ్లింది. అలా ఎక్కువ నష్టం జరిగింది. ఒకవేళ 26న మేం రిలీజ్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ ఉండేది కాదు. అప్పుడు సీన్ వేరేలా ఉండేది అంటూ చెప్పుకొచ్చారు అనిల్ సుంకర.
Read Also : Anil Sunkara : భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..
