Site icon NTV Telugu

NBK 108: బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా ఖరారు

Nbk 107

Nbk 107

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా తీస్తారనే వార్త కొన్నేళ్ళుగా ప్రచారంలో ఉంది. అయితే అది ఇప్పుడు అఫీషియల్ న్యూస్ గా మారింది. బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సైన్ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది సినిమాను నిర్మించబోతున్నారు. గతంలో వీరిద్దరూ ‘కృష్ణార్జున యుద్థం, మజిలి, టక్ జగదీశ్, గాలి సంపత్’ చిత్రాలను నిర్మించారు. విశేషం ఏమంటే ఈ మూవీకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొదటిసారి.

అయితే.. బాలకృష్ణ నటించిన ‘అఖండ’తో పాటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గోపీచంద్ మలినేని మూవీకి కూడా థమనే సంగీత దర్శకుడు. ఆ రకంగా బాలకృష్ణకు వరుసగా మూడు చిత్రాలకు థమన్ సంగీతం అందిస్తున్నట్టు లెక్క. ఈ సినిమా న్యూస్ ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణతో సినిమా చేయడం పట్ల అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణ 108వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో శ్రుతీహాసన్ నాయికగా నటిస్తోంది. ఆ సినిమా పేరును ఖరారు చేయాల్సి ఉంది.

Exit mobile version