సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. పొంగల్ కానుకగా వచ్చిన సినిమాలో యూనానిమస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి నెక్ట్స్ ఏంటి అనే చర్చ మొదలైంది. అయితే తెలిసిన సమాచారం ప్రకారం ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ ను కలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి లైన్ కూడా వినిపించాడని అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. అయితే ఈ సినిమా ఎప్పటి నుండి మొదలవుతుంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే చిరు ఇప్పటికే విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. చివరి షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫినిష్ అయితే దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఫినిష్ అయ్యేసరికి అటు ఇటుగా ఏడాది సమయం పడుతుంది. సో చిరు తో అనిల్ రావిపూడి సినిమా ఈ ఏడాది లేనట్టే.