Site icon NTV Telugu

RRR: ఇంతకూ ఎన్టీయార్ కు హీరోయిన్ ఉన్నట్టా లేనట్టా!?

NTR

మాగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉంది. దాంతో ప్రచార ఆర్భాటాన్ని నిదానంగా పీక్స్ కు తీసుకెళ్ళే పనిలో రాజమౌళి బృందం పడింది. తాజాగా ఎన్టీయార్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళిని కూడా కలిపి దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూను మీడియాకు ఇచ్చారు మేకర్స్. విశేషం ఏమంటే అనిల్ రావిపూడి సినిమాల మాదిరే ఈ ఇంటర్వ్యూ కూడా ఫన్ రైడ్ తరహాలో సాగిపోయింది. అందులో ఓ కీలకమైన విషయం కూడా బయట పడింది.

Read Also : RRR Pre Release event : కన్ఫర్మ్ చేసిన టీం… ఎప్పుడు? ఎక్కడంటే ?

రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ పాత్రకు జోడీగా సీతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను పెట్టారు. అలానే భీమ్ పాత్రధారి ఎన్టీయార్ కు జోడీగా బ్రిటీష్ యువతి ఒలీవియాను ఎంపిక చేశారు. అయితే… వీరిద్దరి మధ్య సాగేది మౌన ప్రేమే కానీ అంతకు మించి ఇంకే జరగదని తెలుస్తోంది. ఈ విషయమై ఎన్టీయార్ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు. ‘మీకు హీరోయిన్ ఉన్నట్టేనా!?’ అని అనిల్ రావిపూడి అడిగిన ప్రశ్నకు ఎన్టీయార్ చెప్పిన జవాబు చిత్రంగా ఉంది. ”అదే తెలియడం లేదు. ఉండీ లేనట్టుగా, నాదా కాదా అన్నట్టుగా, అసలు నాకు హీరోయిన్ ను పెట్టారా? లేదా అన్నట్టుగా ఉంది” అంటూ సమాధానం చెప్పారు. ‘మూవీ ట్రైలర్ లో ఒలీవియాను చూపించారు కదా!’ అని అన్నప్పుడు… ‘అదేదో సినిమాలో (‘సింహరాశి’)లో అమ్మా… మెరుపుతీగా ఒక్కసారి వచ్చి వెళ్ళిపో’ అన్నట్టుగా నా హీరోయిన్ నూ అందులో అలా చూపించారు” అంటూ ఎన్టీయార్ చమత్కరించాడు. విశేషం ఏమంటే…. దీనిని రాజమౌళి బలపర్చడం కానీ ఖండించడం కానీ చేయలేదు. సో… రామ్ చరణ్, అలియాభట్ మధ్య ఉండే కెమిస్ట్రీ, అజయ్ దేవ్ గన్, శ్రేయ మధ్య కనిపించే బాండింగ్… మనకు ఎన్టీయార్, ఒలీవియా పాత్రల మధ్య కనిపించే ఆస్కారం లేదు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ముందే మెంటల్ గా ఫిక్స్ అయిపోతే బెటర్!!

Exit mobile version