Extra Ordinaryman: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కోసం రంగంలోకి దిగిన యాంగ్రీ మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra Ordinaryman: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది మాచర్ల నియోజకవర్గం తరువాత ఇప్పటివరకు అతని నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈ ఏడాది నితిన్.. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎందుకంటే.. వక్కంతం వంశీ, అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు బన్నీ వదులుకున్న సినిమాను నితిన్ చేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ హైప్ ను మరింత పెంచే క్రియేట్ చేశారు మేకర్స్.
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గురించి అందరికి తెల్సిందే. హీరోగా కాకుండా వేరే ఇతర పాత్రల్లో ఇప్పటివరకు నటించని రాజశేఖర్.. మొట్టమొదటి సారి.. కుర్ర హీరో నితిన్ సినిమాలో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా రాజేశేఖర్ ను సినిమాలోకి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నితిన్ షేర్ చేస్తూ.. “మా ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సెట్స్‌లో అత్యంత వేడుకగా జరుపుకున్న యాంగ్రీ మ్యాన్ డా.రాజశేఖర్ సర్కి స్వాగతం పలుకుతూ మీరు అందరినీ మళ్లీ ఆశ్చర్యపరుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను యాంగ్రీ మ్యాన్” అని చెప్పుకొచ్చాడు. ఇక వీడియోలో రాజశేఖర్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
- Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
Welcoming the Most Celebrated ANGRY MAN Dr.Rajashekar sir on the sets of our #Extraordinaryman 💐 I'm sure you're going to stun everyone again Angry Man 🤗🤗
#Ext#ExtraordinarymanOnDEC8th pic.twitter.com/sHdV1HT55O— nithiin (@actor_nithiin) October 16, 2023
తాజావార్తలు
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!