NTV Telugu Site icon

Hi Nanna: నాని సినిమాతో టాలీవుడ్‌కు మరో బాలీవుడ్‌ స్టార్ ఎంట్రీ

Hi Nanna

Hi Nanna

Angad Bedi entry in tollywood with Hi Nanna: టాలీవుడ్ ఇప్పుడు అన్ని భాషల నటులకు కేరాఫ్ అవుతోంది. ఇప్పటికే చాలా మని బాలీవుడ్‌ నటులు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు మరో స్టార్ కూడా తెలుగులో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఒకరు టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యారు.ఆయన ఇంకెవరో కాదు అంగద్ బేడీ. నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తుంన్నారు. ‘పింక్‌’, ‘టైగర్‌3’ సినిమాలతో అంగద్ బేడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి ‘హాయ్ నాన్న’లో ఆయన నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆయన కన్ఫర్మ్ చేశారు.

Kirrak Seetha: బేబీ నటికి లైంగిక వేధింపులు.. 30 లక్షలిస్తా అక్కడికి ‘రమ్మన్న’ ప్రొడ్యూసర్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అంగద్ బేడీ ఈ మేరకు స్పందిస్తూ తెలుగులో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. నా సినిమాలను భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారని పేర్కొన్న ఆయన ‘హాయ్ నాన్న’ ఎమోషనల్‌గా అందరి హృదయాలను హత్తుకుంటుందని అన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే ఈ సినిమాలో ఆయన విలన్‌గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తున్నా ఆ విషయం మీద క్లారిటీ లేదు. నాని సరసన మృణాల్ ఠాకూర్‌ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.ఈ సినిమాలో శ్రుతి హాసన్ కూడా ఒక కీలకపాత్రలో కనిపించనుంది.

Show comments