Site icon NTV Telugu

Tollywood: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్

Tollywood

Tollywood

Tollywood: టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల జోష్ నెలకొంది. ఈనెల 12న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, ఈనెల 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయా సినిమాలకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ ఏపీలో ప్రారంభం కాలేదు. దీనికి కారణం ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయం పెండింగ్‌లో ఉండటమే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు గుడ్‌న్యూస్ అందించింది.

Read Also: Ease Of Living: దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీ నుంచి మూడు పట్టణాలకు చోటు

వాల్తేరు వీరయ్య సినిమాకు 25 రూపాయలు, వీరసింహారెడ్డి సినిమాకు 20 రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అన్ని కేటగిరీల టికెట్లపై పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. సినిమాలు విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు టిక్కెట్ రేట్ల పెంపు వర్తించేలా అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఈ మధ్యాహ్నం నుంచి ఏపీలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా టిక్కెట్లు బుకింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version