NTV Telugu Site icon

Pawan Kalyan: పవర్ స్టార్ ఫాన్స్ కి పండగే.. రీరిలీజ్ కాబోతున్న పవర్ ప్యాకెడ్ మూవీ

Maxresdefault

Maxresdefault

Power Star Pawan Kalyan Gabbar Singh Rerelease: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగ సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వరుసగా కొన్నేళ్లపాటు ప్లాఫ్‍లు ఎదురైన సమయంలో ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ హిట్ గ నిలవడమే కాకుండా ప్రొడ్యూసర్స్ మరియు బయర్స్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2012 మే 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీలో గబ్బర్ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రంలో పవర్ స్టార్ స్వాగ్, యాక్షన్, మేనరిజమ్‍లతో పాటు కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను అలరించాయి. ఈ మూవీలో పవన్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఐకానిక్‍గా నిలిచిపోయాయి. తన ఎనర్జీతో పవన్ అదరగొట్టేశారు. పవన్ కళ్యణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గ నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. హిందీ మూవీ దబాంగ్‍కు రీమేక్‍గా కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు.

Also Read:Samantha Dhulipalla: శోభిత చెల్లి సమంత.. నాగచైతన్యతో ఫోటోలు పోస్ట్

అప్పట్లోనే ఈ చిత్రానికి సుమారు రూ.150కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బంపర్ హిట్‍గా ఈ మూవీ నిలిచింది. పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గబ్బర్ సింగ్ మూవీకి దేవీ శ్రీప్రసాద్ పాటలు కూడా పెద్ద బలంగా నిలిచాయి. పవన్ అభిమానులకు గబ్బర్ సింగ్ చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఇప్పటికే ఎన్నో రీరిలీజ్ సినిమాలు ట్రెండ్ చూస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో గబ్బర్ సింగ్ ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాకినాడ డిస్ట్రిక్ట్ అయిన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టడటంతో పాటు గ్రామీణాభివృద్ది సహా మరిన్ని కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పవర్ స్టార్ చేయాల్సిన సినిమాలకు బ్రేక్ పడింది. మళ్లీ ఆయనను వెండితెరపై చూసేందుకు మరింత సమయం పడుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆలోగానే గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అవుతుండటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. వెండితెరపై మళ్లీ ఈ సూపర్ హిట్ మూవీని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

Show comments