AHA: ‘అందరూ బాగుండాలి…’ టీజర్, ట్రైలర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andaru Bagundali Teaser Trailer Released: మలయాళంలో చక్కని విజయాన్ని అందుకున్న ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ పేరుతో అలీబాబ, కొణతాల మోహన్ కుమార్, శ్రీ చరణ్ ఆర్. రీమేక్ చేశారు. అలీ, నరేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శ్రీపురం కిరణ్ డైరెక్ట్ చేశారు. ఈ నెల 28న సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, బ్రహ్మానందం హాజరయ్యారు. ప్రచార చిత్రాల ఆవిష్కరణ అనంతరం ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..”అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన ‘వికృతి’ సినిమా నచ్చి, తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారిన అలీని అభినందిస్తున్నాను. ఈ మూవీతో కొత్త దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం. మేము ఆలీతో తీసిన బ్లాక్ బస్టర్ ‘యమలీల’ నెక్ట్స్ ఇయర్‌కు 30 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆలీ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉన్నాడు. నటుడుగా వేయి చిత్రాలకు పైగా నటించిన ఆలీ ఈ చిత్రం ద్వారా సొంత బ్యానర్ పెట్టి సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ”బాల నటుడుగా ఇండస్ట్రీకి వచ్చి అంచె లంచెలుగా ఎదిగి 1200 సినిమాలలో నటించడం గొప్ప విషయం. ఇలా ఇన్ని సినిమాలు చేసిన బ్రహ్మానందం కూడా ఈ వేదికపై ఉండడం విశేషం. మనసుకు హత్తుకునే మంచి కథను సెలెక్ట్ చేసుకుని తన బ్యానర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. నటుడు నిర్మాత ఆలీ మాట్లాడుతూ, ”మలయాళం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరేష్ గారు నేను పోటాపోటీగా నటించాం . 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి గారితో కలిసి మళ్ళీ నటించడం ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణంలో దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని హామీ ఇచ్చారు. ఆహా తరపున బాలబొమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, ”మలయాళంలో విజయం సాధించిన ‘వికృతి’ మూవీని తీసుకుందామని, ఆ చిత్ర నిర్మాతను అడిగితే అది అప్పుడే వేరే వారు తీసుకున్నారని చెప్పడంతో కొంత బాధ అనిపించింది. తీరా చూస్తే నేను కావాలనుకున్న అదే సినిమా ఇప్పుడు ఆహాకు రావడం చాలా సంతోషం వేసింది” అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ, ”1200 సినిమాలు చేసిన అలీ గారు మొదటి సారి నిర్మాతగా మారి చేస్తున్న ఈ సినిమాకు నేను దర్శకుడు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎస్. మురళి మోహన్ రెడ్డి కెమెరా వర్క్, రాకేశ్ పళిడమ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు పృథ్వీ, శివబాలాజీ, భద్రం, సంగీత దర్శకుడు రాకేశ్ పళిడమ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
- Devara 2 Update : 'వర'కు ఏమైంది ?... జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!