NTV Telugu Site icon

Anchor Suma: నేను హఠాత్తుగా చనిపోతే.. నా పిల్లలకు ఎంత డబ్బు వస్తుంది అనేది..

Suma

Suma

Anchor Suma: యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. నటి అవ్వాలని కేరళ నుంచి వచ్చి.. సీరియల్ నటిగా నటిస్తున్న సమయంలోనే మరో నటుడు రాజీవ్ కనకాల ను ప్రేమించి పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలుగా మారిపోయింది. ఇక రాజీవ్ తో పెళ్లి తరువాత యాంకరింగ్ మొదలుపెట్టి.. టాప్ యాంకర్ గా మారింది. నటుడుగా రాజీవ్ కు వస్తున్న పారితోషికం కంటే సుమ ఎక్కువ సంపాదిస్తుంది. రాజీవ్, సుమ లకు ఇద్దరు పిల్లలు. కొడుకు రోషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బబుల్ గమ్ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే కొడుకుతో పాటు ఆమె కూడా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచేస్తుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమ.. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడింది. ముఖ్యంగా.. ఫైనాన్షియల్ విషయాలను చెప్పుకొచ్చింది.

Lokesh Kanagaraj: ప్రమోషన్స్ లో అపశృతి.. లియో డైరెక్టర్ కి గాయాలు?

“సాధారణంగా భర్తలు చనిపోయాక.. భార్యలు తమ పిల్లలను ఎలాగైనా పోషించాలనుకుంటారు. చివరికి నాలుగు ఇళ్లలో పనిచేసి అయినా పిల్లల్ని చదివిస్తారు. భర్త ఉన్నప్పుడే డబ్బు దాచుకోవడం.. ఇన్స్యూరెన్స్ తీసుకోవడం, భర్త చనిపోతే ఆ డబ్బు.. పిల్లలకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించరు. ఈ కాలంలో అదెంతో ఉపయోగపడుతుంది. నేను హఠాత్తుగా చచ్చిపోతే .. నా పిల్లలకు ఎంత డబ్బు వస్తుంది.. ? ఎక్కడెక్కడ నుంచి డబ్బు వస్తుంది.. ? ఎవరెవరు ఇస్తారు.. ? అని ముందే చెప్పా. ఇవన్నీ కచ్చితంగా పిల్లలకు తెలియాలి. రియాల్టీనే పిల్లలకు నేర్పించాలి. ఈ విషయాలు మాట్లాడితే.. మాపిల్లలు ఇప్పుడెందుకు మమ్మీ ఇలా మాట్లాడతావు అంటారు. కానీ, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.