Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ లేడీ యాంకర్స్‌లో ఒకరిగా దూసుకుపోతున్న యాంకర్ ‘శ్రీముఖి’ ఇటీవల హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెనే స్వయంగా ఆ ఇంటి గృహప్రవేశం ఫొటోస్ను తన ఫాలోవర్లతో సోషల్ మీడియాలో పంచుకుంది. నిన్న, మే 10న ఈ యాంకరమ్మ గారి బర్త్ డే కావడం, ఇక అదే రోజు ఆమె కొత్త ఇంట్లో అడుగుపెట్టడంతో ఆ డబుల్ హ్యాపీనెస్‌ను దాచుకోలేక ఇలా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. “మీరు కూడా మీ డ్రీమ్స్ పెద్దగా కంటేనే… జీవితంలో ముందుకు వెళ్ళగలరు….” అంటూ, ఆ ఇల్లు కొనడంలో తనకు ఎంతో హెల్ప్ చేసిన బ్రదర్ సుశ్రుత్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈ సందర్భంగా ఆమె థ్యాంక్స్ చెప్పారు. అలాగే తన తమ్ముడితో కలిసి హోమంలో పాల్గొన్న పిక్స్ అండ్ పాలు పొంగిస్తున్న వీడియోస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
డెంటిస్ట్ అవుదామని అనుకోని వచ్చి, ఆ తరువాత అనుకోకుండా ఆర్టిస్ట్, యాంకర్‌గా స్థిరపడిన ఈ నిజామాబాద్ బిడ్డకు ఇది మూడో ఇల్లు. బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి రన్నర్ అప్‌గా నిలిచిన శ్రీముఖి, ఆ మరుసటి ఏడాదే తన సొంతూరు నిజామాబాద్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఆ తరువాత బిబి జోడి సీజన్ 1కు యాంకరింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్‌లో మరో ఇల్లు తీసుకుంది. ఇక ఇప్పుడైతే తాజాగా సిటీలో ఓ లగ్జరీ ఇల్లు తీసుకుంది. ‘అదుర్స్’ అనే రియాలిటీ షోతో 14 ఏళ్ల క్రితం టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి, తన అందం, చలాకీ యాంకరింగ్‌తో ‘బుల్లితెర రాములమ్మ’గా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుని, ఇలా ఓ ఇల్లు తరువాత మరో ఇల్లు కొంటూ పోతుంది. ప్రస్తుతం ఈ బిజీ యాంకర్ ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోతో పాటు, ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే రియాలిటీ షోకి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తుంది.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు