బుల్లితెరపై తనదైన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్న యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి అందరిని మెప్పించాడు. తనదైన రీతిలో ఆట ఆడి అందరి మన్ననలు పొందిన రవి రెండు వారల క్రితం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. అయితే బయటికి వచ్చాకా అతనిపై సోషల్ మీడియాలో పలువురు దారుణంగా ట్రోల్స్ చేశారు. అతడిని, అతడి కుటుంబాన్ని కించపర్చేలా మాట్లాడుతూ పోస్ట్ లు పెట్టారు. ఇక నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహానికి గురైన రవి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మరోసారి ప్రస్తావించాడు రవి. పోలీసులతో మాట్లాడుతున్న వీడియో ఒకటి షేర్ చేస్తూ ” మీరు చేయాలనుకున్నది చేయండి.. నేను చేయాల్సింది నేను చేస్తాను.. కానీ ద్వేషపూరిత సందేశాలు పెట్టేముందు ఒక 30 సెకన్లు ఆలోచించండి” అని పేర్కొన్నారు. తనను ట్రోల్స్ చేసిన వారి పేర్లు, స్క్రీన్ షాట్స్ ని ఆధారాలుగా పోలీసులకు చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
