నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. మహిళ చేసే త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం వారి జీవితాల్లో అండగా నిలిచినా మహిళలకు ఉమెన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో హాట్ యాంకర్ అనసూయ ఉమెన్స్ డే రోజున నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది.
మహిళా దినోత్సవం రోజున ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇస్తూ ట్వీట్ చేసింది. ” ఓ సడెన్ గా ఈరోజు ప్రతి ట్రోలర్ మరియు మీమ్ మేకర్ మహిళలను గౌరవించడం ప్రారంభించేస్తున్నారు. ఇది కేవలం ఈ 24 గంటల్లో ముగిసిపోతుందన్న విషయం తెల్సిందే.. అందుకే మహిళలు దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్వీట్ చేసింది. దీంతో అమ్మడిపై ట్రోలర్స్ మరోసారి విరుచుకుపడ్డారు. నిజమే నిజమే ఎంతోమంది నీలాంటి వాళ్ళు మోసం చేస్తేనే మేము ఇలా తయారయ్యాం అని కొందరు.. అందరు పురుషులు ఒకేలా ఉండరు.. అది గుర్తుంచుకోండి అనసూయ గారు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
