బుల్లితెర యాంకర్ అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది.. ఒకపక్క షోలు చేస్తూనే మరోపక్క నటిగా తన ప్రత్యేకతను చాటుకొంటుంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించనున్న ఈ భామ తాజాగా మరో కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో ఒక సున్నితమైన ప్రేమకథను పరిచయం చేసిన జయ శంకర్ ఈ సినిమాతో మరో కోణాన్ని వెలికితీయాలని చూస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు ఈ చిత్రంలో అనసూయ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
బుక్ షెల్ప్స్ మధ్య ఒక బుక్ ని చదువుతూ కనిపించింది అనసూయ.. అమ్మడి ఫేస్ మొత్తం కనిపించకపోయినా వయ్యారంగా నిలబడిన ఆమె స్టైల్ మాత్రం ఆకట్టుకొంటుంది. అందాలను ఆరబోయడంలో అనసూయ తగ్గేదేలే అంటున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో కూడా అమ్మడు అందాల ఆరబోత ఉంటుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
