NTV Telugu Site icon

Suma Adda: యాంకర్ సుమతో మల్లెమాల కొత్త షో.. ప్రోమో వైరల్

Suma Adda

Suma Adda

Anchor Suma: యాంకర్ సుమకు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా సుమ టీవీ రంగంలో నంబర్‌వన్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఒకవైపు టీవీ యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమా ఫంక్షన్‌లకు కూడా సుమ హాజరవుతోంది. తాజాగా ఈటీవీలో యాంకర్ సుమ మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో పేరు సుమ అడ్డా అని ఫిక్స్ చేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలను ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వాహకులు సుమ అడ్డాను కూడా నిర్మిస్తున్నారు. ఈ షో ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు ఈ షో టెలికాస్ట్‌ కానుంది. జనవరి 7న తొలి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Read Also: Project K: ప్రభాస్ సినిమా యూనిట్ లో విషాదం, మరణించిన ప్రొడక్షన్ డిజైనర్

సుమ అడ్డా తొలి షోకు కళ్యాణం కమనీయం మూవీ టీమ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు హీరో సంతోష్ శోభన్, హీరోయిన్‌ ప్రియా భవానీ, డైరెక్టర్‌ అనిల్ కుమార్ ఆళ్ల గెస్ట్‌లుగా వచ్చారు. వాళ్లతో సుమ తనదైన స్టైల్లో నవ్వులు పంచుతోంది. ఈ మేరకు నిర్వాహకులు ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోను చూస్తే ఈ షో ఫుల్ సందడిగా సాగుతుందని అనిపిస్తోంది. కాగా ఇటీవల ఓ టీవీ ప్రోగ్రామ్‌లో సుమ యాంకరింగ్‌కు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. అయితే సుమ ఈ కామెంట్స్‌పై స్పందించి తాను యాంకరింగ్ నుంచి తప్పుకుంటున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేసింది.

Show comments