Suma Adda: యాంకర్ సుమతో మల్లెమాల కొత్త షో.. ప్రోమో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Suma: యాంకర్ సుమకు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా సుమ టీవీ రంగంలో నంబర్‌వన్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఒకవైపు టీవీ యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమా ఫంక్షన్‌లకు కూడా సుమ హాజరవుతోంది. తాజాగా ఈటీవీలో యాంకర్ సుమ మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో పేరు సుమ అడ్డా అని ఫిక్స్ చేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలను ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వాహకులు సుమ అడ్డాను కూడా నిర్మిస్తున్నారు. ఈ షో ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు ఈ షో టెలికాస్ట్ కానుంది. జనవరి 7న తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Read Also: Project K: ప్రభాస్ సినిమా యూనిట్ లో విషాదం, మరణించిన ప్రొడక్షన్ డిజైనర్
Also Read
సుమ అడ్డా తొలి షోకు కళ్యాణం కమనీయం మూవీ టీమ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ప్రియా భవానీ, డైరెక్టర్ అనిల్ కుమార్ ఆళ్ల గెస్ట్‌లుగా వచ్చారు. వాళ్లతో సుమ తనదైన స్టైల్లో నవ్వులు పంచుతోంది. ఈ మేరకు నిర్వాహకులు ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోను చూస్తే ఈ షో ఫుల్ సందడిగా సాగుతుందని అనిపిస్తోంది. కాగా ఇటీవల ఓ టీవీ ప్రోగ్రామ్‌లో సుమ యాంకరింగ్‌కు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. అయితే సుమ ఈ కామెంట్స్‌పై స్పందించి తాను యాంకరింగ్ నుంచి తప్పుకుంటున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!