Site icon NTV Telugu

Anasuya Bharadwaj: బోల్డ్ క్యారెక్టర్‌లో అనసూయ.. ఈసారి అంతకుమించి

Anasuya Sumati

Anasuya Sumati

Anasuya Bharadwaj Playing Bold Character As Sumati In Vimanam: ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నటించినప్పటి నుంచి.. యాంకర్ అనసూయకు వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు విమానం సినిమాలోనూ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే ఎమోషనల్ & బోల్డ్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఆ పాత్ర ఎమోషనల్ జర్నీ చుట్టే ఈ విమానం సినిమా అల్లుకుని ఉంటుంది. జూన్ 9వ తేదీన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్రపాటి (కిర‌ణ్ కొర్రపాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) నిర్మిస్తున్నారు.

NTR30: తారక్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. ఆరోజు మాస్ జాతరే!

సోమ‌వారం అన‌సూయ పుట్టినరోజుని పురస్కరించుకొని.. విమానం మూవీ మేకర్స్ సుపతి పాత్రకు సంబంధించి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. అందులో సుమతి అందంగా రెడీ అవ్వడాన్ని చూపించారు. అస‌లు ఆమె అలా రెడీ కావ‌టానికి గల కార‌ణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనని మేకర్స్ అంటున్నారు. ఇందులో వీర‌య్య అనే అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తున్నాడు. అలాగే.. రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్‌, డేనియ‌ల్ పాత్రలో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్రలో రాహుల్ రామ‌కృష్ణ నటిస్తున్నారు. అస‌లీ పాత్ర‌ల మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంట‌నేది తెలియాలంటే జూన్ 9 వ‌ర‌కు ఆగాల్సిందే.

Exit mobile version