Anasuya Bharadwaj is willing to play grandmother roles in future:”శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా రూపొందుతున్న ‘పెదకాపు-1’ సినిమాను ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి అనసూయ భరధ్వాజ్ ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ క్రమంలో ఆమె పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. “రంగస్థలం” అనసూయ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్, అప్పటి నుండి ఆమె వైవిధ్యమైన పాత్రలలో తన సత్తాను నిరూపించుకుంది. అయితే అనసూయ కేవలం మూస పాత్రలకే పరిమితం కాదని, ఇప్పటివరకు అందరూ చేసుకుంటున్న అపార్థానికి క్లారిటీ ఇస్తున్నానని ఆమె పేర్కొంది. “నేను ఎలాంటి పాత్రకైనా అందుబాటులో ఉంటాను, అమ్మమ్మ పాత్రలో నటించడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
Anupama Parameswaran: సెల్ఫీ పోజులతో మాయ చేస్తున్న అనుపమ
అయితే ఆ పాత్ర కథకు సంబంధించిన అంశాలలో ముఖ్యమైందిగా ఉండాలి’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర కోసం మిగతా భాషల నుంచి కూడా కొందరిని అనుకున్నారు, అలాంటి బలమైన పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను అనే తృప్తి ఉంది అని ఆమె అన్నారు. ఇక ఎలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నారు ? అనే ప్రశ్నకు సమాధానంగా అన్ని రకాల పాత్రలు చేస్తానని, అమ్మమ్మ పాత్ర కూడా చేస్తానని ఆమె అన్నారు. ఐతే ఆ పాత్ర చూసిన తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా వుండాలని ఆమె చెప్పుకొచ్చారు. పెదకాపులో ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారుని, ప్రతి పాత్రకు ఒక మేకోవర్ వుంది ఆ మేకోవర్ లో ఎన్ని రకాలు ఉంటాయో ఈ సినిమా చేసేటప్పుడు నేర్చుకున్నానని ఆమె అన్నారు. ఈ సినిమా చాలా మంచి అనుభవం అని ఆమె చెప్పుకొచ్చారు.