టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, స్టేజిపై అతను మాట్లాడే విధానం చూసి కుర్రకారు రౌడీ హీరోకి ఫిదా అయిపోయారు. విజయ్ మనుసులో ఏది అనిపిస్తే దాన్ని బాహాటంగానే మాట్లాడేస్తాడు. అయితే విజయ్ పైకి కనిపించేంత స్ట్రాంగ్ కాదు అని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25 న రిలీజ్ కానుంది.
ఇక ఇటీవల అనన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు దేవరకొండతో తన వర్క్ ఎలా ఉంది? అన్న ప్రశ్న ఎదురయ్యింది. దీంతో మొదటిసారి విజయ్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ని పంచుకుంది. ” విజయ్ బెస్ట్ కో స్టార్.. అతనితో వర్క్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను వీడీ నటించిన అర్జున్ రెడ్డి చూశాను, ప్రస్తుతం అతనితో లైగర్ చేస్తున్నాను.. అతడు పాత్రల్లో కనిపించినంతగా బయట కనిపించడు. నిజం చెప్పాలంటే విజయ్ ఒక పిరికివాడు. సెట్ లో హక్కులా సైలెంట్ గా ఉంటాడు. ఒక నటిగా తనకు కావాల్సినంత సౌకర్యాన్నిచ్చిన మనోహరమైన వ్యక్తి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై రౌడీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఆమె తిట్టిందో పొగిడిందో అర్థంకావడం లేదని తలలు పట్టుకున్నారు.ఏది ఏమైనా మా రౌడీ హీరోను అంత పెద్ద మాట అంటావా అంటూ రౌడీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
