‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనన్య చేసిన పని ఆ రూమర్స్ నిజం అనిపించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా అభిమానులతో తన రిలేషన్ షిప్ స్టేటస్, ఫేవరెట్ హీరో గురించి మాట్లాడింది. ఓ నెటిజన్ అనన్య తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడిగినప్పుడు, ముందుగా ఆ ప్రశ్న నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ “నేను సంతోషంగా ఉన్నాను” అంటూ ఇన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పింది.
Read Also : Butterfly Teaser : మీ బ్రెయిన్ ని నమ్మొద్దు… అనుపమ థ్రిల్లర్ షో స్టార్ట్
మరొక అభిమాని ఆమెకు ఇష్టమైన సహనటుడి గురించి అడిగాడు. అనన్య ఏమాత్రం ఆలోచించకుండా ఇషాన్ పేరును చెప్పేసింది. రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇన్ డైరెక్ట్ గా సమాధానం ఇవ్వడం, ఫేవరెట్ హీరో ఇషాన్ అని చెప్పడంతో నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. తర్వాత ఆమె తన సహనటులందరూ అద్భుతంగా నటించారని, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ‘ఖో గయే హమ్ కహాన్’లో మళ్లీ పని చేస్తానని చెప్పింది. ఇక అనన్య పాండే ఇటీవల బాయ్‌ఫ్రెండ్ ఇషాన్ ఖట్టర్‌తో కలిసి షాహిద్ కపూర్ పుట్టినరోజు వేడుకలో మెరిసింది. ఈ జంట 2020లో విడుదలైన ‘ఖలీ పీలీ’ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు మొదలయ్యాయి. వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం ఆ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చింది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండతో కలిసి అనన్య నటించిన ‘లైగర్’ విడుదలకు సిద్ధమవుతోంది.
