Site icon NTV Telugu

Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ల సంచలన వ్యాఖ్యలు

Ananya Nagalla

Ananya Nagalla

Ananya Nagalla Comments on casting couch: తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా ఆమెకు మంచి నటిగా గుర్తింపు అయితే వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె ప్లే బ్యాక్ అనే మరో సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ అనే సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. ఆ సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ సినిమా మొత్తం మీద ఆమె అనేక మంది నటీమణులలో ఒకరిగా నిలవడంతో అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Ram Charan: పాక్ మీడియాలో చరణ్ గురించి చర్చలు.. ఇది కదా కిక్కంటే!

కొత్త దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ‘తంత్ర’ సినిమాలో ఆమె నటించింది, మార్చి 15న విడుదల కానున్న ఈ సినిమా ఆమె చుట్టూనే సినిమా నడుస్తుంది. ఇలాంటి హారర్ డ్రామా సినిమాలో ఆమె నటించడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా, అనన్య నాగళ్ల కాస్టింగ్ కౌచ్‌తో సహా తన వృత్తికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. “నాకెప్పుడూ కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదు, సినిమా సెట్‌లో నేను లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు కూడా లేవు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని అని ”ఆమె పేర్కొంది. తాను స్టార్ హీరోయిన్ అయ్యేలా ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ సాధించనప్పటికీ తనకు ఆఫర్లు వస్తున్నాయని అనన్య నాగళ్ల పేర్కొంది. అయితే పబ్లిసిటీ లభిస్తుందని ఉన్నా లేకున్నా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసేవారు ఎంతో మంది ఉండగా అనన్య ఇలా కామెంట్ చేయడం కొంత షాకింగ్ అనే చెప్పాలి.

Exit mobile version