Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anangsha Biswas: సినిమా రంగంలోకి గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా కొత్తగా వచ్చే నటీనటులకు అవకాశాల కోసం ఎదురుచూడటం, ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోవడం పెద్ద సవాలుగా ఉంటుంది. అయితే కొందరు నటీమణులు కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమలోని మరో కోణం కూడా చర్చకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి అనంగ్షా బిస్వాస్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ షాకింగ్ అనుభవాన్ని వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అనంగ్షా బిస్వాస్ భారతీయ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటి, మోడల్ కూడా. అమెజాన్ ప్రైమ్ సంచలన వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ లో ఆమె పోషించిన ‘జరీనా’ పాత్రతో దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందారు. 2007లో ‘ఖోయా ఖోయా చంద్’ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆమె, ‘లవ్ షువ్ తే చికెన్ ఖురానా’, ‘హోస్టేజెస్’ వెబ్ సిరీస్, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ వంటి సినిమాలతో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆమె 2026 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న ‘మిర్జాపూర్: ది మూవీ’ ప్రమోషన్స్‌తో వార్తల్లో నిలిచారు. అయితే సిరీస్‌లలో తాను చేసిన బోల్డ్, నెగటివ్ షేడ్ పాత్రలను చూసి నిజ జీవితంలో కూడా కొందరు నెటిజన్లు ఆన్లైన్లో అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని, రీల్ లైఫ్ పాత్రల ఆధారంగా రియల్ లైఫ్ ని తప్పుగా అంచనా వేయవద్దని ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా స్పష్టం చేశారు.
Also Read
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోకి వచ్చిన సమయంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల గురించి అప్పట్లో తనకు అసలు అవగాహన లేదని చెప్పారు. అలాంటి సమయంలో ఓ సీనియర్ నిర్మాత తనను సంప్రదించి చెప్పిన మాటలు ఆమెను షాక్‌కు గురిచేశాయని అనంగ్షా వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, దాదాపు 70 ఏళ్ల వయసున్న ఓ నిర్మాత తనను ఒక రకమైన షుగర్ డాడీ తరహా సంబంధానికి ఒప్పించేందుకు ప్రయత్నించారట. తనతో ఏడాది పాటు కలిసి ఉంటే ఇల్లు, కారు ఇస్తానని, తన సినిమాలో హీరోయిన్గా అవకాశం కల్పిస్తానని ఆ నిర్మాత చెప్పినట్లు అనంగ్షా తెలిపారు.
ఈ ఆఫర్ తనకు పూర్తిగా ఊహించని విషయమని అనంగ్షా అన్నారు. తాను అప్పటికి పరిశ్రమకు కొత్త కావడంతో ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయని తనకు తెలియదని చెప్పారు. ఆ వ్యక్తి తనతో మాట్లాడుతున్న తీరు, చేసిన ప్రతిపాదన తనకు అర్థం కాక కొంతసేపు షాక్‌లో ఉండిపోయానని ఆమె తెలిపారు. తన కెరీర్‌ను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అసలు ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే ఇంత జరిగినా, ఆ సమయంలో కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాలని కూడా అనంగ్షా అనుకోలేదట. తన కుటుంబం తన విషయంలో చాలా రక్షణగా ఉంటుందని, ఈ విషయం తెలిస్తే తన తండ్రి వెంటనే అన్నీ వదిలేసి ఇంటికి తిరిగి రావాలని చెప్పేవారని ఆమె పేర్కొన్నారు. కెరీర్ కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను మధ్యలోనే ఆపేయాల్సి వస్తుందనే భయంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకోలేదని తెలిపారు.
అయితే ఆ వ్యక్తి ఆఫర్ ను అంగీకరించకుండా వెంటనే అక్కడి నుంచి బయటపడాలని అనంగ్షా నిర్ణయించుకున్నారు. తాను మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా వెంటనే వెళ్లిపోయినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని తలుచుకుని చాలా సేపు ఏడ్చానని తెలిపారు. అప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని తెలియకపోవడంతో ఆ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె చెప్పుకొచ్చారు. తర్వాత అనంగ్షా బిస్వాస్ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో జరీనా పాత్ర ఆమె కెరీర్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
అనంగ్షా చెప్పిన ఈ అనుభవం మరోసారి సినీ పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే నటీనటులు ఎదుర్కొనే సవాళ్లపై చర్చకు దారితీసింది. అవకాశాలు పేరుతో ఇండస్ట్రీలో కొంత మంది ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో ఆమె అనుభవం మరో సారి తెలియజేస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా తన కెరీర్‌ను కొనసాగించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనంగ్షా బిస్వాస్ ప్రయాణం ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- Tags
- Anangsha Biswas
- cinema
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!