Site icon NTV Telugu

Project K : నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ కు ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

Nag-Ashwin

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైఫై మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రం కోసం భవిష్యత్ వాహనాలను అభివృద్ధి చేయడం కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ శుక్రవారం భారతీయ బిలియనీర్, టెక్ ఔత్సాహికుడు ఆనంద్ మహీంద్రా సహాయాన్ని కోరిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో భారీ బడ్జెట్ చిత్రంలో వారు చేస్తున్న ప్రయత్నం దేశం గర్వించేలా ఉందని పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందుతున్న ఈ సైంటిఫిక్ మూవీ కోసం ఆనంద్ మహీంద్రా హెల్ప్ కావాలని కోరారు.

Read also : HBD Sharwanand : వైవిధ్యమే శర్వానంద్ ఆయుధం!

ఇక నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ కు స్పందించిన ఆనంద్ మహీంద్రా “భవిష్యత్తును ఊహించడంలో మీకు సహాయపడే అవకాశాన్ని మేము ఎలా తిరస్కరించగలము? మా గ్లోబల్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలు మహీంద్రా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని xuv700ని డెవలప్ చేశారు” అంటూ ప్రాజెక్ట్ లో సహాయం చేయడానికి అంగీకరించారు. ఆనంద్ మహీంద్రా నుంచి సానుకూల స్పందన రావడంతో నాగ్ అశ్విన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ “చాలా ధన్యవాదాలు సర్… మీ ఎలక్ట్రిక్ మొబిలిటీ నైపుణ్యం కూడా కావాలి… దీనితో కనెక్ట్ అవ్వడానికి ఎదురు చూస్తున్నాను వేలు మహీంద్ర సార్” అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అన్పిస్తోంది. మరి నాగ్ అశ్విన్ ఎలాంటి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్ళబోతున్నారో చూడాలి.

Exit mobile version