Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్‌పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Deverakonda: సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిన్న విషయమైనా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా వారి మొదటి క్రష్ ఎవరు? చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? వంటి ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. తన చిన్నప్పటి రోజులు, అన్న విజయ్ దేవరకొండతో గడిపిన సమ్మర్ హాలీడేస్ జ్ఞాపకాలు, తన తొలి సినీ క్రష్ గురించి ఆయన చెప్పిన విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీకర్ నాయన్ తెరకెక్కించిన ‘సమ్మర్ హాలీడేస్’ చిత్రంలోని ‘క్రష్’ పాట విడుదల కార్యక్రమానికి ఆనంద్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆదిత్య హాసన్, నిర్మాత ఎస్కేఎన్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా “మీ ఫస్ట్ క్రష్ ఎవరు?” అనే ప్రశ్న వేయగా, ఆనంద్ ఇచ్చిన సమాధానం అందరినీ నవ్వించింది.
తాను చిన్నప్పటి నుంచి బాయ్స్ బోర్డింగ్ స్కూల్లోనే చదివానని, అందువల్ల స్కూల్ లైఫ్‌లో ఎవరిపైనా క్రష్ ఏర్పడే అవకాశం రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సినిమాలు చూసే సమయంలో మాత్రం కొంతమంది హీరోయిన్లంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేదని చెప్పారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ‘మురారి’ సినిమా చూసిన తర్వాత అందులో హీరోయిన్గా నటించిన సోనాలి బింద్రేపై తనకు క్రష్ ఏర్పడిందని ఆనంద్ నవ్వుతూ వెల్లడించారు. ప్రస్తుతం ఎవరిపైనా అలాంటి క్రష్ లేదని కూడా సరదాగా చెప్పారు. ఈ సందర్భంగా చిన్ననాటి సమ్మర్ హాలీడేస్ గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు గుర్తు చేసుకున్నారు. సెలవులు వచ్చినప్పుడల్లా అన్న విజయ్ దేవరకొండతో కలిసి ఎక్కువ సమయం క్రికెట్ ఆడుతూ గడిపేవాడినని చెప్పారు. ఆ రోజులు ఇప్పటికీ తనకు ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. దేవరకొండ సోదరుల మధ్య ఉన్న అనుబంధం అభిమానులకు తెలిసిందే. ఇద్దరూ తమ కెరీర్లో ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.
Also Read
ఇక ఈ కార్యక్రమంలో మరో సరదా వ్యాఖ్య కూడా చేశారు ఆనంద్ దేవరకొండ. తన కెరీర్లో పెద్ద విజయంగా నిలిచిన ‘బేబీ’ సినిమా విడుదలై ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఈ మూడు సంవత్సరాల్లో తనకంటే ‘సమ్మర్ హాలీడేస్’ హీరో రోహన్ రాయ్ ఎక్కువ సినిమాలు చేశాడని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు వేదికపై ఉన్న వారంతా చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ తన తదుపరి చిత్రం ‘ఎపిక్’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ‘బేబీ’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్, ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- Anand Deverakonda
- cinema
తాజావార్తలు
-
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్‌పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
-
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!