Baby Movie Team : విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అటు వైష్ణవి కూడా బేబీతో వచ్చిన క్రేజ్ తో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన బేబీ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. బాక్సాఫీస్ వద్ద మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో వైష్ణవికి, ఆనంద్ కు భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఇదే సినిమా టైమ్ లో వైష్ణవి, ఆనంద్ లకు ఎస్కేఎన్, సాయిరాజేష్ లతో గొడవైంది అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత నిర్మాత ఎస్కేఎన్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వొద్దంటూ కామెంట్ చేశాడు.
Read Also : Tollywood : టాలీవుడ్ లో ఆ హిట్ పెయిర్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్.
అతను చెప్పింది వైష్ణవి గురించే అంటూ ప్రచారం జరిగింది. కాగా బేబీ మూవీకి జాతీయ అవార్డు రావడంతో మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి సాయి రాజేష్, ఎస్కేఎన్ లతో పాటు వైష్ణవి, ఆనంద్ కూడా వచ్చారు. అందరూ నవ్వుతూ సాదాసీదాగా కనిపించారు. పైగా ఆనంద్, వైష్ణవికి గొడవ అయిందా అని రిపోర్టర్లు ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని ఆనంద్ కుండబద్దలు కొట్టేశాడు. ఎస్కేఎన్, సాయిరాజేష్ లతో ఆనంద్, వైష్ణవి మరో సినిమా చేస్తున్నారు. అది త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఇదంతా చూస్తుంటే వీరి మధ్య జరిగినవన్నీ సద్దుమణిగాయని తెలుస్తోంది.
Read Also : Jr. NTR : దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
