కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు కార్లు అచ్చివచ్చినట్టుగా కన్పించడం లేదు. తాజాగా ఆయన కారుపై చలాన్ ఉండడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 648 పట్టణ స్థానిక సంస్థలు, 12,607 వార్డు సభ్యులకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా, అందులో విజయ్ అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఓటు వేయడానికి తలపతి విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అయితే విజయ్ అక్కడికి వెళ్లడం వల్ల మీడియా వాళ్ళు ఆయనను చుట్టుముట్టారు. దీంతో సాధారణ ప్రజలకు కొంత అసౌకర్యం కలిగింది. ఇది చూసిన విజయ్ అక్కడ వున్న ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
Read Also : Shaakuntalam : శకుంతల లుక్ కు ముహూర్తం ఖరారు
ఇదిలా ఉండగా… విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎరుపు రంగు మారుతీ సెలెరియోలో వచ్చారు. అయితే ఆ కారు గురించి గూగుల్ లో సెర్చ్ చేసిన కొంతమందికి చెలాన్ పెండింగ్ లో ఉన్నట్టుగా తెలిసిందే. ఆర్టీవో పోర్టల్ ప్రకారం 2020లో కారు ఇన్స్యూరెన్స్ కంప్లీట్ అయ్యింది. 2021లో ఈ కారుపై ఓ పెండింగ్ చెలాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో యాంటీ విజయ్ ఫ్యాన్స్ ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెలాన్ కట్టడానికి డబ్బులు లేవంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం కావాలని స్టార్స్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి తొంగిచూడడం, వాళ్ళ గురించి నెగెటివ్ గా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, కావాలని డీఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.
