NTV Telugu Site icon

Vishal: అన్నా.. నీకు దండం పెడతాం.. నువ్వు సినిమాలు మానేయ్ అన్నా.. ప్లీజ్

Vishal

Vishal

Vishal: కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవలే లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం విశాల్.. మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. పీరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై లోని ఓ ఫ్యాక్టరీలో జరుగుతుండగా.. అక్కడ ప్రమాదం సంభంవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి దెబ్బలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో విశాల్ తో పాటు పదుల మంది విలన్స్ సీన్ చేస్తున్నారు. ఇంతలోనే ఒక వ్యాన్ వెనుక నుండి వచ్చి అదుపు తప్పి ఎదురుగా ఉన్న గోడను గుద్దుకొని ఆగిపోయింది.

Anushka Shetty: దుర్మార్గుల్లారా.. ఎలాంటి ఫిగర్ ను ఎలా చేసేశారురా..?

ఇక అనుకోని ఘటనకు సెట్ లో ఉన్నవారందరూ అవాక్కయ్యారు. విశాల్ సైతం పక్కకు తప్పుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని విశాల్ అభిమానులతో తెలుపుతూ.. తృటిలో పెను ప్రమాదం తప్పింది.. కొంచెం ఉంటే ప్రాణం పోయేది.. నాకేమి జరగలేదు.. ఆ షాక్ నుంచి తేరుకొని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం విశాల్ సినిమాలు మానేయాలని పట్టుబడుతున్నారు. అందుకు కారణం.. విశాల్ కు ఈ ప్రమాదాలు కొత్త కాదు.. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఎన్నోసార్లు సెట్ లో విశాల్ గాయాల పాలయ్యాడు. ఎన్నో రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. దీంతో అన్నా.. నీకు దండం పెడతాం.. నువ్వు సినిమాలు మానేయ్ అన్నా.. ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. సినిమాల కన్నా ప్రాణాలు ముఖ్యమని, విశాల్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments