Site icon NTV Telugu

Amrita Rao: గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడిని పెళ్లాడిన మహేష్ హీరోయిన్

amrita rao

amrita rao

వివాహ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరోయిన్ అమృతరావు. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించిన అమ్మడు.. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ ఆర్జే అన్మోల్‌ తో పీకల్లోతు ప్రేమలో పడి .. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నదట. ఇటీవల తన భర్త ఆర్జే అన్మోల్‌ తో కలిసి తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో తన సీక్రెట్ పెళ్లి గురించి ఈ జంట చెప్పుకొచ్చారు.

2013 నుంచి వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుండేదట.. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో అమ్మడికి పెళ్లి ప్రపోజల్ చేశాడట అన్మోల్.. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలా.. వద్ద అనే డైలమా ఉండేదని, దానికి అన్మోల్ ఒక ప్లాన్ చెప్పాడని చెప్పింది. ఇంట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేయుకుందామని, కెరీర్‌కు కూడా ఎలాంటి ఢోకా ఉండదని చెప్పడంతో టక్కున అమృత ఒప్పుకున్నదట. అలా 2014లో మే 15న జరిగిందని, రెండేళ్లు ఈ సీక్రెట్ పెళ్లిని దాచి ఉంచామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత 2016 లో అధికారికంగా తాము బార్యాభర్తలమని ప్రకటించామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version