Amitabh Bachchan : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అయితే ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై బిగ్ బీ స్పందించట్లేదు. తాజాగా ఐశ్వర్యను పొగడటంపై స్పందించాడు. అమితాబ్ తన కొడుకు అభిషేక్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు.
Read Also : Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్..
మరి కోడలు ఐశ్వర్య రాయ్ ను, జయా బచ్చన్ ను ఎందుకు పబ్లిక్ గా పొగడరు అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అమితాబ్ స్పందిస్తూ.. ‘నేను నా కొడుకును పబ్లిక్ గా ప్రశంసిస్తాను. కానీ ఐశ్వర్య, జయా బచ్చన్ ను నా మనసులోనే పొగుడుతాను. పబ్లిక్ గా పొగడను. అది నాకు ఆడవారిపై ఉన్న గౌరవం.
అంతే తప్ప వారిని పట్టించుకోను అని కాదు. నేను స్త్రీల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను. నా వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు అమితాబ్ బచ్చన్. ఆయన వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు.
Read Also : ReginaCassandra : పొట్టి దుస్తుల్లో రెచ్చగొడుతున్న రెజీనా
