Site icon NTV Telugu

Amitabh : షాకింగ్ : అశ్విని దత్ కాళ్ళు మొక్క బోయిన అమితాబ్!!!

Amitab Bachan Tries To Touch Aswini Dutt Feet

Amitab Bachan Tries To Touch Aswini Dutt Feet

Amitabh Bachchan tries to Touch Ashwini Dutt feet to take blessings: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ తో పాటు సినిమా నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కి రానా హోస్ట్గా వ్యవహరించగా ప్రభాస్ తో పాటు సినిమాలో నటించిన వారు ఈ సినిమాలో తమ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. అయితే ఇదే ఈవెంట్లో ఒక ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది.

Pushpa2 : పుష్ప 2 వాయిదా పై ఫ్యాన్ ఫైర్.. ఏకంగా హీరోకే వార్నింగ్ ఇచ్చాడుగా..

అదేమిటంటే తెలుగు సినిమాలకు సంబంధించి బిగ్ టిక్కెట్ లాంచ్ అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే బిగ్ టిక్కెట్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని స్వయంగా డబ్బులు ఇచ్చి అమితాబచ్చన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని కమల్ హాసన్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబచ్చన్ అశ్వినీ దత్ గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పి ఆయన కాళ్లు మొక్కబోయారు. వెంటనే అశ్వినీ దత్ కూడా రియాక్ట్ అయ్యి ఆయన కూడా అమితాబచ్చన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. అశ్వినీ దత్ చాలా గొప్ప మనిషి అని ఇంత సింపుల్ గా ఉండే నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. సెట్లో ముందుండే ఆయన హీరో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని అమితాబ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version