Site icon NTV Telugu

స్టార్ సింగర్ దారుణం.. బెడ్ రూమ్ లో లవర్ ని అలాచేసి ఆ తరువాత

american singer

american singer

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ జె స్టాష్‌, తన ప్రేయసిని హత్య చేసి తానుకూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే జె స్టాష్‌ గా పేరు గాంచిన జస్టిన్‌ జోసెఫ్‌ అమెరికాలో ర్యాపర్ గా ఫేమస్. అతడి సాంగ్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గతకొద్దికాలంగా స్టాష్‌, జెనటీ గాలెగోస్‌ అనే మహిళతో రిలేషన్ ని కొనసాగిస్తున్నాడు. ఆమెకు అంతకుముందే పెళ్ళై, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. జనవరి 3 న ఆమెతో మాట్లాడానికి ఇంటికి వెళ్లిన స్టాష్‌.. ఆమెను బెడ్ రూమ్ కి పిలిచాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన స్టాష్‌ తనతో పాటు తెచ్చిన గన్ తో ప్రేయసిని కాల్చి చంపాడు. అనంతరం తను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక గన్ సౌండ్స్ వినడంతో భయపడిన పిల్లలు, నాయనమ్మ సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన అమెరికాలో సంచలనంగా మారింది. క్షణికావేశంలో స్టాష్‌ చేసిన పని పిల్లలను అనాధలుగా మార్చింది.

Exit mobile version