Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గట్లేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదన్నాడు. అందుకే పెళ్లి చేసుకోకుండా బ్రేకప్ చెప్పాను. చాలా మంది నాకు ప్రపోజల్స్ చేసినా సినిమాలు మానేయాలని కండీషన్లు పెట్టారు. అందుకే పెళ్లి చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నా. సినిమాల్లో బిజీ అయ్యాక అసలు పెళ్లి గురించే మర్చిపోయాను అంటూ తెలిపింది అమీషా.
Read Also : Prabhas : దీపిక గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలిస్తే అంతా షాక్..
రీసెంట్ గా నాకు ఎక్కువగా నాకంటే చిన్న వారి నుంచే ప్రపోజల్స్ వస్తున్నాయి. నా ఏజ్ లో సగం ఉన్న వారితో డేటింగ్ చేయడానికి అయినా నేను రెడీ. కాకపోతే వాళ్లు కాస్త మెచ్యూరిటీగా ఆలోచించాలి. అలాంటి వారితో అయితే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికీ నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ కరెక్ట్ అబ్బాయి దొరికినప్పుడు దాని గురించి ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో షాక్ కు గురి చేస్తున్నాయి. చిన్న వాళ్లతో కూడా డేటింగ్ చేస్తా అనడంతో.. మేం రెడీ అంటూ కొందరు నెటిజన్లు ఆమెకు రిప్లై ఇస్తున్నారు. ఈ బ్యూటీ రీసెంట్ గా సన్నీడియోల్ తో చేసిన సినిమాతో మంచి హిట్ అందుకుంది. తెలుగులో పవన్ తో బద్రి, మహేశ్ బాబుతో నాని సినిమాల్లో నటించింది.
Read Also : Bigg Boss 9 : అమ్మాయిలను ఈడ్చిపడేసిన సుమన్ శెట్టి.. ఇలా అయ్యావేంటయ్యా..
