Ameer Log: హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలతో ‘అమీర్ లోగ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ ద్వారా ఈ మూవీ ఆగస్ట్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు, మేకింగ్ అనుభవాలను లీడ్ యాక్టర్స్ MC హరి, మనోజ్, శశిధర్ మీడియాతో పంచుకున్నారు.
సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండేందుకు సింక్ సౌండ్‌లో చిత్రీకరించారు. విమానం లేదా ఏసీ సౌండ్ లాంటి చిన్న శబ్దం వచ్చినా టేక్ ఆపేసేవారమని, కేవలం 5 శాతం రోడ్ సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పామని తెలిపారు. సినిమా మొత్తం సహజమైన లొకేషన్లలో, దర్శకుడి అత్తగారి ఊరు/బస్తీలోనే షూటింగ్ జరిపారు. కథలోని పాత్రలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ కథ బిర్యానీ అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. “ఫస్ట్ హాఫ్‌లో బిర్యానీ వాసన వస్తే.. సెకండాఫ్‌లో టేస్ట్ తెలుస్తుంది.. క్లైమాక్స్‌కి వెళ్లేసరికి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది” అని సరదాగా వివరించారు. షూటింగ్ సమయంలో ఓ క్లౌడ్ కిచెన్ పెట్టి యూనిట్ అందరికీ అక్కడే భోజనాలు సిద్ధం చేశారట. స్క్రీన్‌పై ముగ్గురు హీరోలు ప్రధానంగా కనిపించినప్పటికీ, కథలో తల్లి, అక్క, వదిన, పక్కింటి పాత్రల వంటి మహిళా పాత్రలే అత్యంత కీలకంగా ఉంటాయని వెల్లడించారు.
Also Read
సినిమా ఫుటేజ్ చూసిన రానా దగ్గుబాటి బృందం మొదట హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్లు విస్తరించాలని సూచించినట్లు పేర్కొన్నారు. స్మరణ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (RR) చిత్రానికి ప్రాణంగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాదీ యాస, సంస్కృతి, సహజ సిద్ధమైన హిందీ-ఉర్దూ పదాల కలయికతో రూపొందినప్పటికీ.. కథలోని బలమైన ఎమోషన్స్ భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయని నటీనటులు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?