Site icon NTV Telugu

Ambati Rambabu: రచ్చకెక్కిన BRO శ్యామ్ బాబు.. ఢిల్లీకి బయలుదేరిన అంబటి

Ambati Rambabu On Bro

Ambati Rambabu On Bro

Ambati Rambabu Delhi Tour to complain on Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని డైరెక్ట్ చేసిన మూవీ బ్రో. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో శ్యామ్ బాబు అనే పాత్ర పెట్టి తనను కావాలనే అవమానించారు అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. అంతేకాదు కలెక్షన్స్ గురించి ప్రస్తావించిన ఆయన పవన్ రెమ్యునరేషన్ లెక్కలు సైతం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది.

Sharwanand: కొత్త పెళ్లి కొడుకు అప్పుడే ‘బేబీ ఆన్ బోర్డ్’ అంటున్నాడు.. ఏంటి కథ?

తాజాగా బ్రో సినిమా పంచాయితీ ఢిల్లీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్టీవీ ఆయనను పలకరించగా కొన్ని కీలక విషయాలను బయట పెట్టారు. ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నానని వెల్లడించిన ఆయన ఒక కీలక విషయమై ఢిల్లీకి వెళ్తున్నానని అన్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్న అంబటి పవన్ కళ్యాణ్ బ్రో సినిమా పెట్టుబడులపై చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని అన్నారు. తాను చెప్పాల్సింది చెప్పానని, సినిమా నిర్మాత కూడా చెప్పాల్సింది ఆయన చెప్పాడని అన్నారు. ఇక ఈ సినిమాలో వారు చేసిన క్యారెక్టర్ ఎవరిదో ప్రజలకు అందరికీ తెలుసని అంబటి అన్నారు. పవన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ మీద, ఫండ్స్ మీద ఆరోపణలు చేసిన ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version