NTV Telugu Site icon

Malli Pelli : ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపి వేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో..

Whatsapp Image 2023 07 04 At 7.48.27 Am

Whatsapp Image 2023 07 04 At 7.48.27 Am

నరేష్‌ మరియు పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది.లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.. తన పరువుకు భంగం కలిగించేలా మళ్ళీ పెళ్లి సినిమా ఉందని, ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఈ కేసును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ప్రైమ్ తొలగించనట్లు తెలుస్తుంది.

తెలుగుతో పాటు కన్నడ స్ట్రీమింగ్‌ను కూడా ఆపేసినట్లు సమాచారం.నరేష్‌ మరియు పవిత్రా లోకేష్ జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలతో దర్శకుడు ఎం.ఎస్‌. రాజు మళ్ళీ పెళ్లి సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా టీజర్స్ మరియు ట్రైలర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా థియేటర్ల లో మాత్రం ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. నరేష్, పవిత్రా లోకేష్ ఎలా రిలేషన్ లోకి వచ్చారో వంటి అంశాలను తెరకెక్కించాడు దర్శకుడు ఎం. ఎస్ రాజు.విజయకృష్ణా మూవీ బ్యానర్‌పై నరేష్ తానే స్వయంగా మళ్ళీ పెళ్లి సినిమా ని నిర్మించారు. ఈ సినిమాలో వనితా విజయ్‌కుమార్, శరత్‌బాబు మరియు జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు.అందరికి తెలిసిన కథే కావడంతో థియేటర్లలో ప్రేక్షకులు ఈ మూవీకి అంతగా ఆదరణ లభించలేదు.. కానీ ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మంచి వ్యూస్ ని కూడా రాబట్టింది. కానీ కోర్ట్ కేస్ లతో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ మూవీ స్ట్రీమింగ్ ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.