NTV Telugu Site icon

Amardeep Mother: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మమ్మల్ని వేధిస్తున్నారు.. నీచంగా వాడి దగ్గరకు పంపిస్తావా అంటూ

Pallavi

Pallavi

Amardeep Mother: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా నడుస్తుంది. ఎలిమినేషన్ అయినవాళ్ళు మళ్లీ వస్తున్నారు.. కొత్తవాళ్లకు పవర్స్ ఇస్తున్నారు. పాతవాళ్ళు 5 వారాలు కష్టపడి కంటెండర్ గా మారితే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వెంటనే బిగ్ బాస్ వారు కూడా హౌస్ మేట్స్ అని చెప్పడంతో.. ఓల్డ్ కంటెస్టెంట్స్ కు కొద్దిగా కోపం వస్తుంది. ఇక హౌస్ గురించి పక్కన పెడితే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు బయట మద్దతు గట్టిగానే పెరుగుతుంది. శివాజీ ఇస్తున్న సలహాలతో ప్రశాంత్ గట్టిగానే ఆడుతున్నాడు. అయితే అమర్ దీప్ మొదటినుంచి ఆట మీద ఫోకస్ పెట్టినా ఏదో ఒక గందరగోళం చేసి చివరి నిమిషంలో ప్లాప్ అవుతున్నాడు. ఇక గతవారం అమర్ తన గేమ్ ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ .. అమర్ దీప్ కుటుంబాన్ని వేధించడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పల్లవి ప్రశాంత్ ఎంత రైతు బిడ్డ అయినా.. యూట్యూబర్ అయినా కూడా బయట మంచి పీఆర్ ను పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్లు.. కొంతమంది కుర్రాళ్లను పోగుచేసి.. ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని.. అమర్ దీప్ ఫ్యామిలీని నీచంగా తిడుతున్నారు. ఇక ఈ విషయమై అమర్ తల్లి స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది.

Akira Nandan: పవన్ వారసుడి రాక కోసం.. స్టార్ రైటర్ ఎదురుచూపులు

“నేను అమర్‌దీప్‌ తల్లిని.. మీకు ఏమైనా మతుండే అలాంటి కామెంట్స్‌ పెడుతున్నారా? కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్‌ ఏమైనా పై నుంచి దిగివచ్చాడా?.. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు.. ప్రశాంత్‌ దగ్గరకు అమర్‌దీప్‌ భార్యని, తల్లిని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావ్‌రా.. మీకు పల్లవి ప్రశాంత్‌ మీద ప్రేముంటే ఓట్లేసి గెలిపించుకోరా.. అంతేకానీ తల్లి, భార్యల జోలికి వస్తే ఇంటికి వచ్చి కొడతా. నేను అమ్మను రా.. నన్ను ప్రశాంత్‌ దగ్గరకు పంపిస్తావా? ఎవడ్రా నీకు చదువు నేర్పింది? కొంచెమైనా సంస్కారం ఉందా?.. నీచమైన బతుకులు మీవి.. ఆడవారిపై ఇలాంటి మాటలు అనడం మీకు సిగ్గుగా లేదు. ఇంట్లోవాళ్లు ఎంతగా బాధపడతారో మీకు తెలియదా.. ? మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు. నాగార్జున దగ్గరకు వెళ్లి ఇదే విషయం మాట్లాడతా.. ఏమనుకుంటున్నారో, జాగ్రత్త” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.