Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alpha Teaser : స్పై పాత్రలు ఇప్పటివరకు బాలీవుడ్లో చాలానే వచ్చాయి. రీసెంట్ గా దురంధర్ సృష్టించన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే మొత్తం స్పై యూనివర్స్‌ను తన భుజాలపై మోసే స్థాయిలో ఒక మహిళ ప్రధాన పాత్రతో సినిమా రావడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అదే సాహసం చేస్తోంది ‘ఆల్ఫా’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మక స్పై యూనివర్స్ నుంచి వస్తున్న తొలి మహిళా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం, ఈ రోజు విడుదలైన టీజర్‌తో మరింత హాట్ టాపిక్ గా మారింది. రెండు నిమిషాల నిడివి కూడా లేని ఈ గ్లింప్స్, ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
దర్శకుడు శివ్ రావైల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. టీజర్ ప్రారంభం నుంచే కథలోకి ప్రేక్షకులను లాక్కెళ్లే ప్రయత్నం చేసింది చిత్రబృందం. తన 18వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న యువతిగా కనిపించే ఆలియా, విలాసవంతమైన హోటల్లో తన తండ్రితో సమయం గడుపుతూ ఉంటుంది. ఆ తండ్రి పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తాడు. అయితే సాధారణ పుట్టినరోజు వేడుకగా మొదలైన ఆ క్షణం, ఒక్కసారిగా జీవితాన్ని మార్చే మిషన్‌గా మారిపోతుంది. తన కూతురికి ‘ఆల్ఫా’ అనే అత్యంత రహస్య సైనిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిన బాధ్యతను అప్పగించడం కథకు కీలక మలుపు ఇస్తుంది.
Also Read
- Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
ఆ తర్వాత టీజర్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కఠినమైన శిక్షణ, రహస్య ఆపరేషన్లు, ప్రమాదకరమైన మిషన్లు, శత్రువులతో పోరాటాలు వరుసగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలియా భట్ ఈ సినిమాలో చూపించిన ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్, యాక్షన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు రొమాంటిక్, ఎమోషనల్, డ్రామాటిక్ పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ స్టార్‌గా కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అత్యంత ఉగ్రంగా కనిపించే ఆలియా, ఒక వ్యక్తి తలకు తుపాకీ గురిపెట్టి నిలబడిన షాట్‌తో టీజర్ ముగుస్తుంది. ఈ ఒక్క సన్నివేశమే సినిమాలో ఆమె పాత్ర ఎంత తీవ్రంగా, ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో సూచిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యాక్షన్ టోన్ అన్నీ కలిసి హాలీవుడ్ స్థాయి స్పై థ్రిల్లర్ అనుభూతిని కలిగిస్తున్నాయి.
ఈ టీజర్లో శర్వరి, అనిల్ కపూర్ కనిపించకపోయినా, వారి పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండబోతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. బాబీ డియోల్ మాత్రం తక్కువ సన్నివేశాల్లో కనిపించినప్పటికీ తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ‘యానిమల్’ తర్వాత విలన్ పాత్రల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబీ, ‘ఆల్ఫా’లో కూడా ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కథను ఉదయ్ చోప్రా అందించగా, రోహన్ష్, అబీర్ ద్వయం సంగీతాన్ని సమకూర్చింది. ‘ఏక్ థా టైగర్’, ‘వార్’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ వంటి విజయవంతమైన చిత్రాలతో విస్తరించిన యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో ‘ఆల్ఫా’ ఒక కొత్త అధ్యాయంగా నిలవబోతోంది. ముఖ్యంగా మహిళా స్పై పాత్రను కేంద్రంగా చేసుకుని రూపొందిన తొలి చిత్రం కావడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘ఆల్ఫా’ ఇప్పటికే టీజర్‌తోనే భారీ బజ్ సృష్టించింది. ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పై ఉంది. స్పై యూనివర్స్‌లో ఆలియా భట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- Alpha Teaser
- cinema
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..