ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ముందుగా ఈ సినిమా విషయంలో ఇంతటి భారీ ప్లాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్‌కి విక్రయించింది. అనంతరం అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచన మార్చుకుని ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. దీంతో ‘పుష్ప’ టీమ్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అక్కడ మైత్రి, గోల్డ్ మైన్స్ మధ్య వివాదం తలెత్తింది. ఈ సమస్యను నిర్మాతలు పరిష్కరించలేకపోయారు. దీంతో ‘పుష్ప’ హిందీ వెర్షన్ విడుదలపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఎట్టకేలకు అల్లు అర్జున్ ఎంట్రీతో సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారమైంది. ‘పుష్ప’ హిందీ పంపిణీ హక్కులను ఏఏ ఫిల్మ్స్ దక్కించుకుంది. గతంలో బాహుబలి, ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమాలను ఏఏ ఫిల్మ్స్ హిందీలో పంపిణీ చేసింది. ఏఏ ఫిల్మ్స్ రవీనా టాండన్ భర్త అయిన అనిల్ తడానీది. బాలీవుడ్‌లో పెద్ద డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఆయన ‘పుష్ప’ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాడు.
Read Also : తల అజిత్, షాలిని లేటెస్ట్ పిక్స్ వైరల్
Also Read
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
ఇదిలా ఉండగా మిగతా భాషల్లోనూ ‘పుష్ప’ డిస్ట్రిబ్యూటర్లు ఖరారైనట్టు సమాచారం. ఈ4 ఎంటర్టైన్మెంట్ మలయాళంలో, లైకా ప్రొడక్షన్స్ తమిళంలో, స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ కన్నడలో, ఏఏ ఫిలిమ్స్ ఇండియాలో, ఓవర్శిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్ “పుష్ప”ను విడుదల చేయబోతున్నారు. “పుష్ప” మేకర్స్ ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నారు.
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!