తల అజిత్, షాలిని లేటెస్ట్ పిక్స్ వైరల్

తల అజిత్ తెలుగువాడైన కోలీవుడ్ లో ఆయన స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయనకు కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల కాలంలో ఆయన గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినంతగా మరే హీరో ట్రెండ్ అవ్వలేదు. తాజాగా మరోమారు అజిత్, ఆయన భార్య తాజా పిక్స్ వైరల్ అవుతున్నాయి. షాలిని కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఆమె బయట ఎక్కువగా కన్పించడం లేదు. అజిత్ బ్లాక్ సూట్ లో, షాలిని గోల్డ్ కలర్ వెస్ట్రన్ దుస్తుల్లో ఉన్న ఎయిర్ రెండు పిక్స్ ను జతచేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అజిత్, షాలిని ‘అమర్కలం’ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లికి ముందు కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఆ తరువాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ స్టార్ కపుల్ కు ఆడపిల్ల అనుష్క అజిత్, అబ్బాయి ఆద్విక్ అజిత్ కుమార్‌ ఉన్నారు.

Read Also : ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్.. ఈ సమయంలో అవసరమా..?

కాగా అజిత్ ఇటీవల భారతదేశం అంతటా, కొన్ని విదేశీ ప్రదేశాలకు కూడా బైక్ ట్రిప్‌ను ప్రారంభించాడు. అతని బైక్ ట్రిప్ నుండి వచ్చే ఫోటోలు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఈ హీరో చెన్నైకి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలో తన తరువాత చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అజిత షూటింగ్ పూర్తి చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ “వాలిమై” 2022 పొంగల్‌ కు థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

Latest Articles