NTV Telugu Site icon

Allu Sneha Reddy: కెమెరా ముందుకు అల్లు అర్జున్ భార్య.. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ.. ?

Sneha

Sneha

Allu Sneha Reddy: నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి ఎంతో అల్లరిచిల్లరగా తిరిగే బన్నీని పక్కా ఫ్యామిలీ మ్యాన్ లా మార్చింది అతని భార్య స్నేహారెడ్డి. పెళ్లి తరువాత బన్నీతో చాలా మార్పు వచ్చింది. అదంతా తన భార్యవలనే అని అల్లు అర్జున్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక అల్లు స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లువారి ఇంటికి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇంకోపక్క బిజినెస్ విమెన్ గా కొనసాగుతోంది. ఇక సోషల్ మీడియాలో స్నేహ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్లకున్న అందం స్నేహ సొంతం. నిత్యం ఫోటోషూట్స్ తో అదరగొడుతూ ఉంటుంది. ఎప్పటినుంచో అభిమానులు స్నేహను వెండితెరపై చూడాలని కోరుకుంటూనే ఉన్నారు.

ఇక ఎప్పుడు బన్నీ, స్నేహ కనిపించినా.. ఇద్దరు కలిసి ఒక సినిమా చేయొచ్చు కదా అని కామెంట్స్ పెడుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లకు స్నేహ కెమెరా ముందుకు వచ్చింది. అయితే సినిమాలో కాదు.. ఒక యాడ్ ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్‌ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ లో అల్లు స్నేహ ఫిమేల్ లీడ్ గా కనిపించింది. పింక్ కలర్ డ్రెస్ లో స్నేహ అదిరిపోయింది. ఇక తన యాక్టింగ్ కూడా ఎంతో నేచురల్ గా కనిపిస్తుంది. ఇక ఈ యాడ్ ను స్నేహ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అందరూ.. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వండి.. చాలా బాగా చేశారు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు స్నేహ ఏమైనా సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

Show comments