లెజెండరీ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని నిన్న అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. అల్లు కుటుంబానికి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం అల్లు స్టూడియోస్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోజు అల్లు రామలింగయ్య శత జయంతి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన సోదరులు బాబీ, శిరీష్‌తో కలిసి వారి తాత, లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Read Also : ‘రిపబ్లిక్’ టీంకు మెగాస్టార్ విషెస్
అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ లో పాల్గొంటాడని అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అల్లు బ్రదర్స్ ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఆయన మా గర్వం. అల్లు స్టూడియోస్‌లో మా ప్రయాణంలో భాగం అవుతారు” అని అల్లు అర్జున్ చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
