Site icon NTV Telugu

అల్లు వారసుడొచ్చేశాడు.. బన్నీ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ..?

అల్లు అర్జున్ వారసులు అర్హ, అయాన్ లు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ వైఫ్ స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇకపోతే అల్లు అర్హ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అయాన్ ని కూడా సినిమాల్లోకి దింపడడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయాన్ అల.. వైకుంఠపురం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.

ఇక తాజగా మెగా మేనమామ వరుణ్ కోసం రంగంలోకి దిగాడు. వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్ర ప్రమోషన్ లో అయాన్ భాగమయ్యాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నఈ చిత్రం డిసెంబర్ 3 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘గని’ పాటకు అయాన్ రీల్స్ చేస్తూ కనిపించాడు. ఈ మూవీలోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌కు అయాన్‌ చేసిన వర్కవుట్‌ వీడియోను జతచేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిచ్చరపిడుగు అయాన్ బాక్సింగ్ గ్లౌజెస్ తొడుక్కొని.. వరుణ్ తేజ్ చేసే వర్కవుట్ విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలో అయాన్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version