NTV Telugu Site icon

Allu Sneha Reddy: అల్లు అర్జున్ చనిపోయినా పర్లేదు అని చెప్పిన ధైర్యం ఆమెది

Bunny

Bunny

Allu Sneha Reddy: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ గా ఆయన ఎదిగిన వైనం అందరికి తెల్సిందే. అయితే పెళ్లి తరువాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు అనడం కన్నా అల్లు స్నేహరెడ్డి అతనిని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లోనే బన్నీ, స్నేహల మధ్య పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్ళికి దారి తీసింది. పెళ్ళికి ముందు బన్నీ సినిమాల్లో ఒక రొమాంటిక్ యాంగిల్ ఉండేది. లిప్ కిస్ లు సైతం అప్పుడప్పుడు కనిపించేవి. కానీ, పెళ్లి తరువాత బన్నీ.. ఆ కిస్సులకు చెక్ పెట్టేశాడు. భార్యకు ముందే చెప్పేశాను అని చెప్పుకొచ్చేశాడు. ఇక ఈ జంటలు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం స్నేహ ఒక బిజినెస్ విమెన్ గా కొనసాగుతోంది. నేటికీ ఈ జంట వివాహ బంధంలోకి దిగి 11 ఏళ్లు పూర్తి చేసుకొని 12 వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kushboo Sundar: నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. అక్కడ తాకుతూ

ఇక అల్లు అర్జున్ సైతం ఒక స్పెషల్ ఫోటోతో తన భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, వీరి పెళ్లి రోజు నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన భార్య గురించి గొప్పగా చెప్పిన వ్యాఖ్యలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ, స్నేహ గురించి ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు.. ఆ సినిమా సమయంలో ఆర్మీలో జాయిన్ అవ్వడానికి తనకు ఛాన్స్ ఉందని.. జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు తన భార్య స్నేహ పర్మిషన్ తీసుకుందామని ఆమెకు కాల్ చేశాడట బన్నీ.. ” స్నేహ.. నేను ఆర్మీలో జాయిన్ అవుదామనుకుంటున్నాను అనగానే.. ఓ సూపర్ వెళ్లు అంది. ఏంటి సూపర్ జాయిన్ అవ్వడమంటే.. డ్రెస్ వేసుకొని కూర్చోవడమనుకుంటున్నావా.. వార్ లో పాల్గొనాలి.. ఫైట్ చేయాలి అని చెప్పాను.. అవును చేయాలి కదా.. వార్ లో తలపడు అని చెప్పింది.. ఇక చివరికి ఒకవేళ ఆ వార్ లో పోతే అని అడిగాను.. అప్పుడు ఆమెనుంచి నాకు బెస్ట్ ఆన్సర్ వచ్చింది.. అయితే ఏంటి.. చనిపోయినా పర్లేదు.. ఎందుకంటే దేశం కోసం నా భర్త చనిపోయాడు అని గర్వపడతాము అని చెప్పింది” అని చెప్పుకొచ్చాడు. అలాంటి భార్య దొరకడం తనకు ఎంతో లక్కీ అని బన్నీ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక వీరు ఇలాంటి పెళ్లిరోజులు ఎన్నో చేసుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments