NTV Telugu Site icon

Allu Arjun : నేడు పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్

Alluarjun

Alluarjun

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవల అరెస్టయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. గత రెండు రోజులుగా వాదోప వాదనలతో ఈ కేసు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయంశంగా మారింది.

Also Read : Jr. NTR : వార్ – 2 షూటింగ్ ముగిసింది.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

ఇదిలా ఉండగా డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను నేడు పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నట్లు సమాచారం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మొత్తం 18మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ ఈకేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. తాజాగా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడంతో అల్లు అర్జున్‌ తమ లీగల్‌ టీమ్‌తో గత రాత్రి అత్యసరంగా సమావేశమయ్యారు. నేడు విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై ఎలా స్పందిచాలనే విషయమై సుదీర్ఘ చర్చలు జరిపారు. నేడు పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్ ను మరోసారి అరెస్ట్ చేస్తారేమో అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.