ఇటీవల హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దర్శించగా, తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ, అక్కడి విశేషాలను వివరించారు. ఇక అల్లు అర్జున్ ను చూసిన జనం ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.
Read Also : Mahaan : హీరోయిన్ కు షాక్ ఇచ్చిన టీమ్… ఫ్యాన్స్ కు నిరాశ
ఇక సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫీవర్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప : ది రైజ్” డిసెంబర్ 17న విడుదలైంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండవ భాగం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
