NTV Telugu Site icon

Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..

Bunny

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. దీంతో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. ఇక జాతీయ అవార్డు అందుకున్న విన్నర్స్ అందరికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గండిపేట లో గ్రాండ్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు మొత్తం హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. తన 20 ఏళ్ల కల నిజమైందని, తన మిత్రుడు దేవి శ్రీప్రసాద్ తో కలిసి ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

“బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కి ఎన్నోసార్లు చెప్పా. దాదాపు 20 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ.. ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా అనేవాడు. అతడి మాటలు విని.. మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడిని. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్పతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట ఇలా నిజమైనందుకు నాకు సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించిన నాడు మా నాన్న ఎంతో ఆనందించారు. నేను కూడా ఢిల్లీ వస్తా.. దేవికి వాళ్ళ నాన్న సత్యమూర్తి లేకపోతే .. నేను ఉన్నానుగా.. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్టు ఉందన్నారు. నాన్న మేము సాధించాం. మీ భాషలో చెప్పాలంటే.. చెన్నైలో తిరిగే ఇద్దరు పోరంబోకులు.. ప్రిన్సిపల్‌ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్‌ దగ్గర మెడల్స్‌ తీసుకుంటామని అనుకున్నావా? అని అడిగాను.

జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ, నాకు అవార్డు రావాలని సుకుమార్‌ మరెంతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎఛీవర్‌ ఆయనే.. నేను కేవలం అఛీవ్‌మెంట్‌ మాత్రమే..” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments