‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం గెస్ట్ గా అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల్ అక్కినేని, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కలిసి నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు సినీ ప్రియులు, అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తర్వాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తెలుగులో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. తాజా నివేదిక ప్రకారం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” టీమ్ రేపు సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను జరుపుకోబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను చిత్రబృందం ఆహ్వానించింది. రేపు హైదరాబాదులో జరగనున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారు.
Read Also : చిరంజీవి, మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడుకున్నారు
Also Read
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించగా, గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ప్రదీష్ వర్మ కొరియోగ్రాఫర్, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్. మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.